![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -12 లో.. సెక్యూరిటీ లేకుండా సిరి కాలేజీకి వెళ్తుండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ధనతో కబుర్లు చెప్తుంటుంది. మా అన్నయ్య అంటే నాకు ఇష్టమని సిరి చెప్తుంది. రెండు వేళ్ళు చూపించి ఒకటి నేను.. ఒకటి మీ అన్నయ్య ఎవరు ఇష్టమో ఒక వేలు పట్టుకో అని ధన అడుగగా.. కాసేపటికి సిరి రెండు వేళ్ళు పట్టుకొని నాకు ఇద్దరు ఇష్టమే అని చెప్తుంది.
మీ అన్నయ్యకి నువ్వు ఇష్టమే కదా మన విషయం చెప్పు.. పెళ్లి చేసుకుందామని ధన అంటాడు. ఇప్పుడే వద్దు పెళ్లికి ఇద్దరు కాదు రెండు ఫ్యామిలీస్ ఉండాలని.. నీ ఫ్యామిలీ గురించి ఒక్కసారి కూడా చెప్పలేదు ఎందుకు మీ నాన్నకి బాషా అంత ప్లాష్ బ్యాక్ ఉందా అని సిరి అనగానే... ఏమని చెప్పాలి తాగి పడుకుంటాడని చెప్తే ఎం బాగుంటుందని ధన మనసులో అనుకుంటాడు. మరొక వైపు మాణిక్యం పడుకొని ఉంటాడు. మీకు లోన్స్ కావాలా అంటూ ఫోన్లు చేసి విసిగిస్తూ ఉండడంతో కావాలని కాల్ చేసిన అతన్ని ఇంటికి పిలుస్తాడు.. అతను వచ్చి మీకు కార్ ఉందా లోన్ ఇస్తామని అనగానే.. ఉంది అంటూ చిన్న పిల్లలు ఆడుకునే కార్ చూపిస్తాడు. మరి ఎందుకు అన్నావ్.. నా టైమ్ నా పని అంత చెడగొట్టావ్ అంటు అతనిపై మాణిక్యం విరుచుకుపడడంతో బయపడిన అతను.. ఇప్పుడేం చెయ్యలి అంటాడు. నా పని మొత్తం చెయ్యాలని మాణిక్యం చెప్తాడు. దాంతో ఏం చెయ్యలేక ఇంటి పని మొత్తం చేస్తాడు.
మరొకవైపు నీకు ఆఫీస్ లో వాటా ఉంది అంటు శ్రీవల్లి బలవంతంగా సందీప్ ని ఆఫీస్ కి తీసుకొని వెళ్తుంది. ఎలా ఉండాలంటూ అంతా నేర్పిస్తుంది. వెళ్లి సీతాకాంత్ చైర్ లో కూర్చొమని చెప్పగానే సందీప్ కూర్చుంటాడు. పీఏ వచ్చి లేమ్మని అనడంతో శ్రీవల్లి అతని చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ వచ్చి ఆఫీస్ కి నువ్వు ఎప్పుడైనా రావచ్చు కానీ నీకు నువ్వుగా రావాలి ఒక అర్హత జ్ఞానం సంపాదించుకోని రావాలని సందీప్ కి సీతాకాంత్ చెప్తాడు. కాసేపటికి సందీప్ శ్రీవల్లి ఇంటికి వచ్చాక.. ఎందుకు ఆఫీస్ కి వెళ్లారంటూ సందీప్ వాళ్ళ అమ్మ తిడుతుంది. ఆ తర్వాత ధనకి సిరి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |